Saturday, March 25, 2023

వారం వారం భీవారం విశేషాల సమాహారం!

ఉగాద్పచ్చడోఫోబియా!

photo: ఉగాది పచ్చడి (curtesy: కళ్యాణం రాధిక)


మొన్న ఉగాది పండుగ రోజు మా వాట్సాప్ గ్రూప్ లో సరదాగా రాసిన ఓ వ్యాఖ్య. 

స్త్రీ శోభ గురుతు  నాన సంవత్సర ఉగాద శుభాకంక్షలు. 

కాదండీ బాబు కాదు phone లో auto typing చేస్తే అలా వచ్చింది.

ఈ మధ్య viral infection వల్ల దగ్గు, దానికి మందు తాగి, సిట్రిజెన్ టాబ్లెట్ వేసుకుని సదా మత్తులో తూగుతున్నాను అందువల్ల కూడా అలా అయిఉండొచ్చు.  తప్పు మన్నించండి .

శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

ఫోన్ లో కపిత్వం రాసి రాసి ఇలగై పోనాది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే  మా పెదనాన్న గారి తిథి వల్ల మా ఇంట్లో ఇప్పుడు ఉగాది పండగ చేసుకోము.  

కానీ చిన్నప్పుడు చేసే వాళ్లేగా. 

హప్పుడండి హుగాది ఫచ్చడి చేసేవాళ్ళు అందరి ఇళ్ళలో మాదిరిగానే. 

నాకు మాత్రం అదంటే సచ్చే బయ్యం. 

అన్ని పండగల మాదిరే తలంట్లు, మొలంట్లు common. 

అప్పుడు చిన్న వాళ్ళం కాబట్టి అన్ని అంట్లూ అమ్మ వాళ్ళే చేసే వాళ్ళు అది common. 

కుంకుడు కాయ రసం కంట్లో common. 

నోట్లోకి చింతపండు,  ఉప్పు common. ఏడిస్తే వీపు మీద దరువూ కామనే.…

Common కాంది ఏమిటంటే ఉగాది పచ్చడి 

దాందుంప తెగ ఎవడు కనిపెట్టాడో కానీ ఆయనకి మాత్రం ఉగాది రోజంతా అన్నం పెట్టకుండా దాన్ని మాత్రమే తా...గిచ్చి toilet కి తాళం వేసి ఉంచితే నా సామిరంగా... బలేగుంటది. 

కొంతమంది దాని ప్రియులు ఉన్నారు. ఎప్పుడు ఉగాది వస్తుందా, ఎప్పుడు ఓ గిన్నెడు లాగిద్దామా అనుకునే వాళ్ళు ఉంటారని తెలుసు. కాకపోతే వారు కళ్ళు అరమోడ్పులు చేసి దాన్ని ఆస్వాదిస్తూ తాగుతుంటే నేను మాత్రం హాచ్చర్య పోయి చూస్తూ ఉంటా. నా కళ్ళ గుడ్లు ఊడి పడిపోయేంతగా పెద్దగా అవుతాయి. కడుపులో  గంటెలు నేను తిప్పుతా అంటే నేను తిప్పుతా అని కొట్టుకుంటూ ఉంటాయి. 

ఆ ఉగాది పచ్చడి గిన్నె పట్టుకొని వస్తున్న స్త్రీ మూర్తిని చూస్తే, చిన్నప్పుడు మా అమ్మ  ఓ పెద్ద గిన్నెలో ఆముదం తీసుకొస్తున్న రూపం slow motion లో కనబడుతుంది. అందుకే ఉగాది పండుగరోజు మా అత్తగారింటికి కూడా వెళ్ళను. గుడికి వెళ్ళాలన్నా భయమే. తీర్థంతో పాటు, ఉగాది పచ్చడి కూడా ఇస్తారు. 

మళ్ళీ దీని దుంప తెగ, పండగ తో పాటు పచ్చడి ఎందుకో. 

పచ్చడి తిన్నా, తినక పోయినా జీవితం మాత్రం ఆ షడ్రుచులలో ఏ మాత్రం ఒక్ఖటీ తక్కువ కాకుండా రుచి చూపిస్తుంది. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు అన్నీ, అన్నీ ఒహటి ఎక్కువా, ఒహటి తక్కువా కాకుండా రుచి చూపిస్తుంది. 

అసలు ఇది పడక పోవడం ఏమైనా వ్యాధా అని డౌటు కూడా వచ్చింది. గూగుల్ లో search చేశా. ఉగాది పచ్చడి అంటే ఉన్న భయాన్ని ఏమంటారు అని. ఆ పిచ్చి ముండ బిక్క మొహం వేసింది. 

సరే chat gpt అయితే మన భాదని అర్థం చేసుకొని ఏదైనా సలహా ఇస్తుంది అనుకొని దాన్నీ అడిగా. అది ఇంగిలీసులో ఉగాది అనగా నేమి? దాని ప్రాశస్త్యం ఏమిటి? ఉగాది పచ్చడి recipe అన్నీ చెప్పింది. అది కాదే నీ బొంద నాకు ఉగాది పచ్చడంటే బయ్యం. దీనికేదైనా పేరు ఉందా? ఉంటే అది ఏడువు? అన్నా. 

దానికి chat gpt గారు కొంచెం ఆలోచించి, ఒక పని చేస్తా, నేనూ మిషన్ , నాకు ఎవరేనా నేర్పితేనే నేర్చుకుంటా. లేకపోతే ఇంతకుముందు అందుబాటు లో ఉన్న  data కు తగ్గట్టు ఓ పేరు నేనే సజెస్ట్ చేస్తా. అంటూ ఈ పేరు చూపించింది laptop screen మీద.

 ఉగాద్పచ్చడోఫోబియా! అని.

ఒక విన్నపం:  నాకు పడదని ఏదో సరదాగా నా భావాలను పంచుకున్నాను. అంతే గానీ ఇష్టమున్న వాళ్ళు ఇంకో గిన్నె లాగించండి. కాకపోతే rest room లో కాంపిటీషన్ లేకుండా, ఎవరూ తాళం వెయ్యకుండా చూసుకోండి. 

మరో సారి

 శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

ఉంటా...

దండాలు.

No comments:

Post a Comment